పదేళ్ల క్రితం 1999 మే జూన్ నెలలో పాకిస్తాన్ కార్గిల్ సాక్షిగా యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో భారత్ ఘనవిజయం సాధించింది.  పాక్ ఆక్రమించుకోవాలని చూసిన కార్గిల్ పర్వతాలను ఇండియా తిరిగి సొంతం చేసుకుంది.  ఈ యుద్ధంలో భారత్ కంటే పాకిస్తాన్ కు ఎక్కువ నష్టం సంభవించింది.  


భారత్ కు చెందిన 600 మంది సైనికులు మరణిస్తే.. 6వేల మందికి పైగా పాక్ సైనికులు అసువులు బాశారు.  ఈ యుద్ధం వలన పాక్ సాధించింది ఏమి లేదు.  ఆ తరువాత మరలా పాక్ యుద్దానికి కాలుదువ్వలేదు.  ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే.. మరోమారు అలాంటి యుద్ధం వస్తుందేమో అనిపిస్తోంది.  


ఒకవేళ యుద్ధం కనుక వస్తే... పాకిస్తాన్ కు ఘోరంగా దెబ్బతగిలే అవకాశం ఉంటుంది.  కాల్పుల ఉపసంహరణను పదేపదే ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ కు ఎప్పటికప్పుడు ఇండియా బుద్దిచెప్తూనే ఉన్నది.  ఇందులో భాగమే సర్జికల్ స్ట్రైక్స్.  రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసింది ఇండియా.  


పుల్వామా దాడి తరువాత ఇండియా కాశ్మీర్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన ఉండటంతో.. పరిస్థితులు చాలా వరకు అదుపులో ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: