కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో ఏపికి మొంచి చెయ్యి చూపటం వెనుక రాజకీయ కారణాలేనా అన్న అనుమానం వస్తోంది. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి ఏపి ప్రయోజనాల విషయంలో ఎందుకనో దెబ్బ కొడుతునే ఉన్నారు.  ఎన్డీఏ-1లో అంటే చంద్రబాబునాయుడు కారణంగానే ఏపిని పట్టించుకోవటం లేదని అనుకున్నారు. మరి ఎన్డీఏ-2లో జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యారు కదా ? మరి ఇపుడేమైంది ?


ఎన్డీఏ 1 లో కూడా బిజెపికి రాష్ట్రం నుండి పెద్ద ఆదరణ కనబడలేదు. అప్పట్లో టిడిపితో పొత్తు కారణంగానే బిజెపికి రెండు ఎంపి సీట్లు, నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చిందన్నది వాస్తవం.  మొన్నటి ఎన్నికల్లో అయితే అది కూడా రాలేదు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటుకు బిజెపి పోటీ చేసినా ఒక్క సీటులో కూడా గెలవలేదు. అసలు డిపాజిట్ ఎక్కడ వచ్చిందో కూడా తెలీదు.


సో, రాజకీయంగా చూస్తే  బిజెపికి ఏపి పెద్దగా అచ్చి రాలేదనే చెప్పాలి.  ఇఫుడు కొత్తగా ఏమీలేదు మొదటి నుండి కూడా ఇదే పద్దతనుకోండి అది వేరే సంగతి. దేశమంతా చివరకు తెలంగాణాలో కూడా బిజెపికి నాలుగు ఎంపి సీట్లు వచ్చింది. ఏపిలో మాత్రం కనీసం డిపాజిట్లు కూడా రాలేదు.


బహుశా ఆ విషయాన్ని మోడి మనసులో పెట్టుకున్నట్లున్నారు. ఎందుకంటే దేశమంతా తన హవా వీచినా  ఏపిలో మాత్రం జగన్ ముందు తన ప్రభావం కనబడలేదన్న మంట ఏమైనా మోడిలో ఉందేమో. అయితే ఎంతైనా సీజన్డ్ పొలిటీషియన్ కదా తనలో ఉన్న మంటను  మాటల్లో కాకుండా చేతుల్లో చూపారు. అందుకనే తాజా బడ్జెట్లో ఏపికి మొండిచెయ్యే చూపారు


మరింత సమాచారం తెలుసుకోండి: