తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసిన తర్వాత బహుశా చంద్రబాబునాయుడు పిచ్చ హ్యాపీగా ఫీలైఉంటారు. ఎందుకంటే, ఎన్డీఏ-1 లో చంద్రబాబు కూడా ఎన్డీఏలో భాగస్వామన్న విషయం తెలిసిందే. పేరుకే చంద్రబాబు భాగస్వామైనా ఏపికి జరిగిన ఉపయోగం మాత్రం ఏమీలేదు.  చంద్రబాబు ఎంతగా నరేంద్రమోడితో కాళ్ళబేరానికి దిగినా ప్రయోజనం మాత్రం కనబడలేదు.


మోడితో చంద్రబాబు కాళ్ళబేరానికి దిగటం వెనుక రాష్ట్రప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే ఎక్కువన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటుకునోటు దెబ్బకే మోడి ఏపి ప్రయోజనాలను గాలికొదిలేసినా ఏమీ చేయలేకపోయారు. సరే మోడితో ఎలా ఉన్న లాభం లేదనుకునే చివరకు రాజకీయ కారణాలతోనే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారన్నది వాస్తవం.


సరే మొత్తానికి అన్నీ విధాలుగాను దెబ్బతిన్న చంద్రబాబు చివరకు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ కూడా మునుపటికన్నా మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చారు. దాంతో జగన్మోహన్ రెడ్డి ఆశలపై నీళ్ళు చల్లినట్లైంది.  ఎప్పుడైతే  మంచి మెజారిటితో మోడి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో  అప్పుడే సీన్ అర్ధమైపోయింది. 


తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మోడి వైఖరేంటో బయటపడింది. తాజా బడ్జెట్ చూసిన తర్వాత జగన్ రియాక్షన్ ను పక్కనపెడితే చంద్రబాబు మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీలై ఉంటారనటంలో సందేహం లేదు. ఆ హ్యాపీని బయటకు చూపించకపోయినా లోలోపల మాత్రం ఆనందంగా ఉంటారనటంలో సందేహం లేదు. అధికారంలో ఉన్నపుడు మోడి దెబ్బకు తాను ఎంతగా ఇబ్బందులు పడ్డారో అవే ఇబ్బందులు జగన్ కు కూడా ఎదురవుతుండటంతో చంద్రబాబు హ్యాపీగా లేకుండా ఎలాగుంటారు ?


మరింత సమాచారం తెలుసుకోండి: