దాదాపు ఆరున్నర దశాబ్దాలకు పైగా అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధం, అమెరికా వత్తాసుతో ప్రతిపక్షం కొనసాగిస్తున్న కుట్రలను అధిగమించి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి పట్టాలను అందుకున్న దాదాపు 63 వేల మందికి పైగా విద్యార్థులను వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌ అభినందించారు.

 

దేశంలో ఉన్నత విద్యారంగ అభివృద్ధి కోసం 2003లో అప్పటి ఛావెజ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మిషన్‌ రాబిన్సన్‌' కార్యక్రమంలో భాగంగా తాజాగా 63,545 మంది విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్‌ పట్టాలను అందుకున్నారు. నగరంలోని థియేటర్‌ ఆఫ్‌ మిలటరీ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్రిగ్జ్‌ వారికి పట్టాలను అందచేసి అభినందించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దిగ్బంధం, నిర్బంధ పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొని విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులు పట్టుబిగిస్తే మాతృభూమిని నిర్బంధపు సంకెళ్ల నుండి విముక్తి చేయగలరన్నారు.

 

గ్రాడ్యుయేట్‌ పట్టాలను అందుకున్న విద్యార్ధులకు అధ్యక్షుడు నికొలస్‌ మదురో తరఫున అభినందనలు తెలియచేసిన విద్యామంత్రి అరిస్టోబులో ఇస్టరిజ్‌ 16 ఏళ్ల క్రితం ఈ మిషన్‌ను ప్రారంభించిన సోషలిస్టు నేత ఎలిజెర్‌ ఓటయిజా కృషిని వివరించారు. మిషన్‌రాబిన్సన్‌ కార్యక్రమం మానవాతావాదంతో నిండిందని తాను సగర్వంగా చెబుతున్నానని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: