ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రమాణస్వీకారం నుంచి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటు ఏపీలో తెలుగు దేశం పార్టీ అభిమానుల చేత కూడా శభాష్ అనిపించుకుంటున్నారు వైఎస్ జగన్. ఈ విషయాలన్నీ చూస్తుంటే మరికొంత కాలంలో చంద్రబాబు నాయుడు చేత కూడా శభాష్ అనిపించుకునేలా అనిపిస్తుంది. ఒకేవేళ అలంటి పరిస్థితి వచ్చిన చంద్రబాబు గారు అనరు అనుకోండి. 


అయితే ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి కార్యక్రమంతో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15వేళా చొప్పున తల్లి ఖాతాకు చేరుస్తా అన్న జగన్ మరోసారి విద్యార్ధుల కోసం సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. విద్యారంగంపై నిపుణుల కమిటీతో చర్చించిన సీఎం జగన్ .. ఏ స్థాయిలోను విద్యార్థులు చదువుమనకూడదు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడులను బాగు చేయడాన్ని సవాల్ గా తీసుకున్నామన్న అయన .. హాస్టల్ లో చదివే ప్రతి విద్యార్థికి బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఏటా 20వేళా రూపాయలు అందచేస్తాం అని చెప్పారు. 


ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్, షూ, సాక్స్ కు డబ్బు అందచేస్తాం అని వైఎస్ జగన్ అన్నారు. ఇక విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పట్టణాల్లో అక్షయపాత్రకు, గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తాం అని వెల్లడించారు. అంటే వచ్చే 5 సంవత్సరాలలో ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల వైపు నడిచేలా వైఎస్ జగన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్లల్లో కార్పొరేట్ మూతపడేలా కనిపిస్తున్నాయి జగన్ నిర్ణయాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: