ఈరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.  ఈ బడ్జెట్ లో పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు వరాలు కురిపించారు.  సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి అవకాశాలు కల్పించారు.  అలానే, స్టార్ట్ అప్ లకోసం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.  మహిళకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు.  


ఎన్నో వరాలను ఇచ్చిన కేంద్రమంత్రి చివర్లో రెండింటిపై సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  ఎన్నింటినో తగ్గించి ప్రజలకు మంచి చేసే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినా.. కేవలం రెండింటిపై సుంకాలు పెంచడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది.  


ఈ రెండింటిలో ఒకటి పెట్రోల్, డీజిల్.  ఈ రెండింటిపై రూపాయి చొప్పున సుంకాన్ని పెంచుతున్నట్టు బడ్జెట్ లో పేర్కొన్నారు.  అంటే ఇకపై పెట్రోల్ పై 1 నుంచి రెండు రూపాయల వరకు భారం పడుతుంది.  ఇది మధ్యతరగతి ప్రజలపై భారమని చెప్పాలి.  పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు


అలాగే బంగారంపై కూడా సుంకాన్ని పెంచారు.  ఇప్పటి వరకు 10 శాతం సుంకం ఉండేది.  దీనిని 12.5% శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.  మగువలు బంగారంపై ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు.  ధరలు పెరుగుతాయి కాబట్టి ఇకపై కొనుగోళ్లు తగ్గొచ్చు.  బంగారం దిగుమతో తగ్గితే దేశం అభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు.  అభివృద్ధి, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: