చూడబోతుంటే అలాగే ఉంది చంద్రబాబునాయుడు వైఖరి.  తనకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోలు చేయలేరని అనటమే విచిత్రంగా ఉంది.  ప్రకాశం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ కుటుంబాన్ని పరామర్శించటానికి చంద్రబాబు ఆమె ఇంటికి వెళ్ళారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలే విచిత్రంగా ఉంది.

 

మహిళ ఆత్మహత్య విషయాన్ని ప్రస్తావిస్తూ మహిళను ఈడ్చికొట్టి తన్ని చంపేసినట్లు మండిపడ్డారు. ఓ ఆడబిడ్డ విషయంలో ప్రభుత్వ వ్యవహరించిన తీరే అనాగరికమన్నారు. ఇంత వరకూ బాగానే ఉంది కానీ తర్వాత చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా ఉంది.

 

ఆత్మహత్య చేసుకున్న మహిళ కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేయకుండా తన భద్రత అంశాన్ని ప్రస్తావించటమే విచిత్రంగా ఉంది. తనకు రక్షణ కల్పించటం లేదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

 

తనకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం తన భద్రత విషయంలో జోక్యం చేసుకుంటున్నట్లు మండిపడ్డారు. తనకేమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోలు చేయలేరంటూ చేసిన వ్యాఖ్యలే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు చంద్రబాబుకు ఇపుడేమవుతుందో ఎవరికి అర్ధం కావటం లేదు. చూడబోతుంటే ప్రభుత్వంపై జనాలను రెచ్చ గొడుతున్నట్లే ఉంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: