జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే.  ప్రతి డిపార్ట్మెంట్ ను రివ్యూ చేస్తున్నారు.  ఏక్కడా  ఎలాంటి తప్పు జరిగినట్టు తెలిసినా వదలడం లేదు.  ఎవరైనా సరే సహించేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు.  అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరికలు జారీ చేశారు.  


ముఖ్యంగా ఇసుక మాఫియాపై జగన్ కన్ను పడింది. ఇసుకను నదుల నుంచి అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హుకుం జారీ చేశారు.  గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా వ్యవహారం దారుణంగా ఉండేది.  దీంతో ప్రభుత్వమే ఇసుక సరఫరాకు పూనుకుంది. 


ఇసుక కావాల్సిన వ్యక్తులు డైరెక్ట్ గా ఆయా శాఖను సంప్రదిస్తే తక్కువ ధరకే ఇసుక ఇంటికి వస్తుంది.  ఈ విధానం బాగుండటంతో ప్రస్తుతం ప్రభుత్వం ఈ విధంగానే సరఫరా జరుగుతున్నది. ఇదిలా ఉంటె, హిందూపురంలో బాలకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ గతంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు.  ముఖ్యంగా ఇసుక విషయంలో ఆయన చేసిన అక్రమాలు అన్నిఇన్ని కావు.  


ప్రజల నుంచి పెద్ద ఫిర్యాదులు రావడంతో ఆయన్ను తొలగించారు బాలకృష్ణ.  హిందూపురంలో ఇసుక మాఫియా గురించి జగన్ కు కంప్లైంట్ వెళ్ళింది.  దీనిపై జగన్ నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఒకవేళ హిందూపురం ఇసుక విషయంలో విచారణ చేపట్టాల్సి వస్తే.. బాలకృష్ణను కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: