దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ప్రప్రథమం అవ్వడం ఒక ముచ్చట అయితే, ఆమె తెలుగు మహిళ కావడం మరో విశేషం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు , తెలుగు రాష్ట్రాలకు కనీసం న్యాయం జరుగుతుందని చాలా మంది ఆశించారు కానీ, ఇరు రాష్ట్రాలకు మొండి చేయి చూపించారు. బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారు.

విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇక్కడివారికి కేటాయిస్తున్నారని ఎంపీ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా, పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను నోరుమెదపక పోవడం విశేషం.

ఆదాయపు పన్నులో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కి అయితే చాలా అన్యాయం జరిగింది. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర బడ్జెట్‌లో ఎపీకి ఒరిగింది ఏమీ లేదని ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

''ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని, పోలవరం, అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్దం.'' అని స్పష్టం చేశారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యారని అర్ధిక వేత్తలంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: