చిన్న వ్యాపారులకు పెద్ద ఊరట!!
ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో, జీఎస్‌టీకి సంబంధించి చిరు వ్యాపారుల కోసం, కొన్ని సవరణలు చేసింది. జీఎస్‌టీ రిటర్నుల విధానాన్ని కాప్త సరళతరం చేసింది. ఇప్పటి వరకు, జీఎస్‌టీ పరిధిలోకి వచ్చే వ్యాపారస్తుల టర్నోవర్‌ ఇదివరకు రూ.20 లక్షలు ఉండగా తాజాగా ఈ బడ్జెట్‌లో రూ.40 లక్షలకు పెంచారు. దీనిని దేశవ్యాప్తంగా స్వాగతిస్తున్నారు.

రిటర్నలు ఫైల్‌ చేయడానికి చిరు వ్యాపారుల కోసం ఉచితంగా తయారు చేసి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ బడ్జెట్‌లో రూ.5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న వారు మూడు నెలకోసారి రిటర్నులు దాఖలు చేస్తే చాలు. జీఎస్‌టీ రీఫండ్‌లు పూర్తి ఆటోమేటిక్‌గా రీఫండ్‌ చేసే విధానాన్ని అందుబాటులోకి చేయనున్నారు.

వివిధ రకాల పన్ను లెడ్జర్లను ఒకటే ఛత్రం కిందకు తీసుకురాన్నారు. ఎలక్ట్రానిక్‌ ఇన్వాయిస్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల దాఖలు సమయంలో ఉపయోగపడనుంది. ..................................


మరింత సమాచారం తెలుసుకోండి: