కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం గురిచేసిందని ఇది ప్రజలను మరోసారి మోసం చేసే విధంగా ఉందని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కాకినాడలో ఆందోళన నిర్వహించారు .ముందుగా జిల్లా పార్టీ కార్యాలయం నుండి ప్రదర్శనగా కార్యకర్తలు బయలుదేరి కల్పనా సెంటర్ ముందు మోడీ  దిష్టిబొమ్మను దగ్ధం చేశారు . 


అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విశాఖపట్నానికి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని నేను నిధులు ఇచ్చి కాపాడుకుంటానని ఈ రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేస్తారని అనేక మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లోనే ఈ రాష్ట్ర ప్రజలపై తీవ్ర అన్యాయం చేసారని ఆయన తెలిపారు .ఈ రాష్ట్రానికి రెండు కళ్ళుగా ఉన్న అమరావతి ,పోలవరం ప్రాజెక్ట్ లు ఊసే ఎత్తలేదాని వీటికి ఒక రూపాయి కూడా నిధులు కేటాయించాలని ఇది చాలా దారుణం అని ఆయన పేర్కొన్నారు .


తాడేపల్లిగూడెంలో  తిరుపతిలో ఉన్న iitఅనేక విద్యా సంస్థలకు కనీసం పైసా నిధులు కేటాయించలేదని అన్నారు. కనీసం ప్రత్యేక హోదా లేకపోయినా ఈ రాష్ట్రం నిధులు కేటాయిస్తారని  ఐదు కోట్ల ప్రజలు ఎదురు చూశారని వాళ్ళ ఆశలు అడియాసలే అయ్యే విధంగా మోడీ ప్రవర్తించారని ఆయన పేర్కొన్నారు .ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసి ఢిల్లీకి తీసుకెళ్లి ఢిల్లీపై ఆందోళన చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని కూడా ఆయన నాయకత్వం వహించాలని కోరారు .


మరింత సమాచారం తెలుసుకోండి: