ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి' గారి జయంతి ఈ నెల 8వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగులో జరగనుంది. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి' గారి జయంతి సందర్బంగా జులై ఎనిమిదో తేదీని రైతు దినోత్సవంగా జరపనున్నట్టు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ 8వ తేదీన ఆంధ్ర రాష్ట్రమంతటా రైతు దినోత్సవం నిర్వహించనుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. 


అయితే రైతు దినోత్సవం కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి పాల్గొంటారని, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారని, అదే రోజున పులివెందుల్లో అరటి పరిశోధన సంస్థకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని చెప్పారు, విత్తనాల కొరత మీద మంత్రి మాట్లాడుతూ వేరుశనగ విత్తనాలను సక్రమంగా సరఫరా చేసినట్టుగా, ఉత్తరాంధ్రలోనూ సరిపడ విత్తనాలను సరఫరా చేసినట్టుగా వ్యవసాయ మంత్రి కన్నబాబు ప్రకటించారు. 


అయితే వైఎస్ జగన్ రైతు దినోత్సవం రోజు మరో కీలక ప్రకటన చెయ్యనున్నట్టు పార్టీ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. ఏంటి ఆ కీలక ప్రకటన..? ఇప్పటికే ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సంచలన పథకాలను అమలు చేసి, పుట్టిన పసికందు నుంచి వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరితో ఆశీర్వాదాలు తీసుకుంటున్న జగన్, తండ్రి జయంతి నాడు ఎటువంటి ప్రకటన చెయ్యనున్నారు..?  ఆ ప్రకటన ద్వారా ప్రజలకు ఎలాంటి లాభం రానుంది. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఈ నెల 8వ తారీఖున తెలియనుంది. చూద్దాం మన జగన్ అన్న ఎలాంటి ప్రకటన చెయ్యనున్నారో.   


మరింత సమాచారం తెలుసుకోండి: