కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట . టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు సొంతజిల్లా . ఈ జిల్లా ప్రజలు మొదటి నుంచి టీడీపీ ని ఆదరిస్తూ వచ్చారు . ఎందుకో ఏమో తెలియదు కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులను తిరస్కరించారు . కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెల్చించింది కేవలం రెండు స్థానాలు మాత్రమే. ఆ ఇద్దరు కూడా తాము సొంత బలంతో గెలిచామని భావిస్తూ, ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం పార్టీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు .


విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించగా, గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు, మిగతా 14 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పరాజయం చెందారు , వీరిలో ముగ్గురు మంత్రులు కూడా ఉండడం విశేషం . అయితే గెల్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు అయినా పార్టీ కార్యక్రమాలను తమ భుజస్కందాలపై వేసుకుని ముందుండి నిర్వహిస్తే బాగుండేదని కానీ వారిద్దరూ ఇంతవరకు విదేశాల నుంచి తిరిగివచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ను కలవడానికి కూడా ఆసక్తి చూపకపోడం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది .


కృష్ణా జిల్లాలో గెల్చిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు , పార్టీ వ్యవహారాల్లో  మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న వారేకావడం గమనార్హం . ఉమా ను పార్టీ కార్యక్రమాల్లో  చంద్రబాబు  ఇలాగే ప్రోత్సహిస్తే తమ దారి తాము చూసుకోవడం బెటరన్న నిర్ణయానికి ఇరువురు ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తోంది . అయితే టీడీపీ ని వీడి వీరిద్దరూ వైకాపా లో చేరనున్నారన్న ఊహాగానాలు కూడా ఇటీవల జోరందుకున్నాయి . మరి ఈ ఊహాగానాలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా స్పందిస్తారో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: