జగన్ తన తండ్రి వైఎస్ మరణం తరువాత ఎంతో మంది తన తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక అశువులు బాశారు.  దాదాపుగా 600 మందికి పైగా మరణించారు.  వైఎస్ వాళ్ళను పరామర్శిస్తూ ఓదార్పు యాత్ర చేశారు.  దీంతో జగన్ కు మంచి వ్యాల్యూ వచ్చింది.  జగన్ స్థాయి పెరిగింది.  


ఆ తరువాత 2014 ఎన్నికల్లో ఎపి నుంచి ప్రతిపక్షంలో ఉన్నా.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజల సమస్యలను గురించి తెలుసుకున్నారు.  ఇదే వైకాపా విజయానికి కారణం అయ్యింది.  ఇప్పుడు బాబుగారు కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నారు.  


వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలవడం.. కార్యకర్తల ఇంటికి వెళ్లి పలకరించి నేనెన్నాననే ధైర్యాన్ని ఇస్తున్నారు.  ప్రత్యర్థుల దాడుల్లో మరణించిన కార్యకర్తల ఇంటికి వెళ్లి ఓదారుస్తున్నారు.  


వాళ్లకు అండగా ఉంటానని చెప్తున్నాడు. బాబుగారి ఈ ఓదార్పు యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.   ఎలాగో ఈ ఐదేళ్లు ఖాళీనే కాబట్టి ఎక్కువగా ప్రజల మధ్యన ఉంటూ.. ప్రజా సమస్యలను తెలుసుకొని, వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తే కొంతవరకు ఓటమి భారం నుంచి బయటపడొచ్చు.  వచ్చే ఎన్నికల నాటికి కొంత పుంజుకోవచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: