తెలుగు వారిపై దయచూపని తెలుగింటి కోడలి బడ్జెట్‌ పై ఈ రోజు మీడియాలో వివిధ రకాలుగా విశ్లేషణలు వచ్చాయి. అవన్నీ ఒకెత్తు అయితే, 'సాక్షి' దిన పత్రికలో వచ్చిన బ్యానర్‌ పై సామాజిక మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.

సమకాలీన సామాజిక,రాజకీయాల పై జనహితంగా వ్యాఖ్యలు చేస్తూ ,ఫేస్‌బుక్‌ని చర్చావేదికగా మార్చే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఈ రోజు లో సాక్షి కథనంపై రాసిన విశ్లేషణ ఇది...

మెహబూబ్ ఖాన్ 1940 లో తీసిన ఔరత్ సినిమానే 1957 లో మదర్ ఇండియా గా తీసాడు.సినిమా ప్రారంభం ఒక వృద్ధురాలు ఒక పంట కాలువను ప్రారంభించడం...సినిమా అంతా ఫ్లాష్‌బాక్..కొత్తపెళ్లికూతురు రాధ ఎడ్లబండి మీద రావడం,అత్తారింటి కడపలో కాలుపెట్టడం..ఇక ఆ పల్లెటూళ్లు వర్షాధారం భూములు..పండించిన పంటనంతా వడ్డీ కింద జమ వేసుకునే షావుకారు..అప్పు తీరాలని రాళ్లమయమైన పొలం సాగు చేస్తూ పెద్ద బండను తొలగించే క్రమం లో రాధ భర్త చేతులు నలిగిపోతాయి..ఆ భర్త అవమానంతో దేశాలు పట్టుకుపోతాడు...ఈ దరిద్రాలకు తోడు ఒకసారి అతివృష్టి..ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒకడు చనిపొతాడు...ఆహారం దొరక్క బురదలోంచి ఒక దుంపను తీసి తింటారు...ఈ భూమీదికొచ్చాక బతక్క తప్పుతుందా?

"దునియా మే హం ఆయే హైతో జీనా హీ పడేగా,జీవన్ హై అగర జహత్ తో పీనా హీ పడేగా" అంటూ ఎద్దుల బదులు ఆ తల్లే నాగలి మోస్తుంది..వడ్డీ వ్యాపారి కామవాంఛ ఆగడాలు..ఎన్నెన్నో మలుపులు..చివరికి రాధ చిన్న కొడుకు వ్యాపారి కూతురిని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకుపోతుంటే స్త్రీ గౌరవం కోసం కొడుకునే చంపుతుంది...

ఈ నిర్మలా సీతారామన్ ఏం పీకి కొత్తదనం చూపింది, రైతులకు ఏం ఒరగబెట్టబోతుందని ఈ సాక్షి ఎడిటర్ ఇంతలా "హృదయ పుష్పం" పరిచాడో అర్ధం కాలేదు!!!

ఇక లోపలి పేజీల్లో "జీరో బడ్జెట్‌ ,ఖర్చు లేని సాగు" అట...అరే నాయనా..ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు..చేరిపిస్తున్నవారెందరు?అంతెందుకు..ఎంట్రన్స్ లో ఎన్ని లక్షల మందిలో ఎందరు ఎయింస్,ఐఐటీ సీట్లు సంపాదిస్తున్నారు?....

ఆశ...అదే మానవుడి చోదకశక్తి...ఒకప్పుడు ఆ వ్యవసాయం చేసిన వాళ్లమే..చీడపీడలు,మిడతల దండ్లు...గ్రీన్ రివొల్యాషన్ అన్నారు..ఉత్పత్తే పెంచారో,రోగాలే పెంచారో..రైతుల ఆత్మహత్యలే పెంచారో...సెకండ్ క్లాస్ లో పాస్ అయిన విద్యార్థీ ఒక వజ్రమే,ఆ స్కూల్ లో సాన పట్టలేదు..మేము ఐఐటీ సీట్ తెప్పిస్తామంటాదు చైనా బ్రోకర్...తల్లిదండ్రుల ఆశ సరేనంటుంది..

అప్పోసప్పో చేసి చదివిస్తాడు..చదువేనా?పిల్లల పెళ్లిల్లూ అంతే కాదా!!!అన్ని ప్రాంతాల్లో ఒకే కట్నం...ఆఫీస్ లో లంచాలూ అంతే...ఓటర్ల రేటూ అన్ని ప్రాంతాల్లో ఒకటే..మెట్టప్రాంతాల్లో వర్షాధారం రైతులు,మాగాణి రైతులతో పోటీ పడాల్సిందే...వీళ్లకేం ప్రత్యేక రాయితీలు,కాలువల పక్క రైతులతో సమాన ఆదాయం అంటూ నగదు ఇస్తున్నారా? పారీకరో,అశుతోష్ గౌరీకరో...ఈ కబుర్లకేం ఎన్నైనా చెబుతారు..గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది బాధ..

తెలుగింటి కోడలు ....,అత్తయ్య దగ్గర ఆవకాయ నేర్చుకుంటున్న సాంబారక్కయ్య అని ఈ నిర్మలమ్మ ఫోటోలు చూసి మనం హృదయపుష్పం పరుచుకుంటే..ఈ పత్రికలోళ్లకేం పోయేకాలం,

మదర్ ఇండియా అనడానికి..మనకేం ఒరిగి చచ్చింది?

ఆ పాలకూరపప్పు ప్రభాకర్ ఎక్కడున్నాడో..ఆయన కూడా మన కేటాయింపులు చూసి తిట్టుకునే ఉంటాడు..

ఇత్నా బాలో భాషో ఆచ్హా నై... (By Gopireddy Srinivas Reddy )


మరింత సమాచారం తెలుసుకోండి: