తమ కుటుంభానికి ఆసరా అయినవారు పాకిస్తాన్‌ జైల్లో మగ్గుతున్నారని గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఆరు నెలలు గడిచాయి.. అయినా వారికీ న్యాయం జరగలేదు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. పిల్లలకు చదువులు లేవు. వృద్దులకు , మహిళలకు ఆసరా కరువయ్యింది. అసలు తమవారు తిరిగొస్తారో లేదోనన్న ఆవేదన వారిలో పట్టుకుంది.


కొత్త సర్కారైనా మెర వింటుందో లేదో అన్న ఆశతో బాదిత కుటుంభాల సభ్యలు "స్పందన"కు హాజరయ్యారు.. తమ కన్నీళ్లను కాగితంపై పెట్టి జిల్లా కలెక్టరుకు మొరపెట్టుకున్నారు. ఆశ్చర్యం.. నాలుగు రోజుల్లోనే అధికారులు స్పందించారు. నెలకు రూ.4,500వంతున ఏడూ నెలలకు రావాల్సిన పింఛన్ మొత్తం రూ.31,500 ఒకేసారి మత్స్యకారుల కుటుంబాలకు అందించారు. ఇలా బాధిత 12 కుటుంబాలకు సాయం అందింది. 


పాకిస్తాన్ చెరనుంచి శ్రీకాకుళం మత్స్యకారులను విడిపించడానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసామని కలెక్టర్ నివాస్ తెలిపారు. గత ఏడాది నవంబర్ 11న ఎచ్చర్ల మండలంలోని కె.మత్స్యలేశం, డి.మత్స్యలేశం,బనివాని పేట, ముద్దాడ తదితర గ్రామాలకు చెందిన 12 కుటుంబాలుకు సంబందించిన 15 మంది మత్స్యకారులు పాకిస్తాన్ సైనికులకు చిక్కారు. వీరిలో ముగ్గురు బోట్ డ్రైవర్లు కాగా, మిగిలిన వారు కళాసీలుగా గుర్తించారు.

  

పాకిస్తాన్ అధీనంలో ఉన్న జిల్లాకు చెందిన మత్స్య కారుల కుటుంబాలకు నెలవారీ పింఛన్ల చెక్కులను కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం కలెక్టర్ ఆఫీసులో పంపిణీచేశారు. మత్స్యకారుల కుటుంబాలకు నెలకు రూ.4,500 ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా 7నెలలకు రూ.31,500 వంతున ప్రతికుటుంబానికి అందచేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: