తిండి, బట్ట, గూడు.. ఇవీ మనిషి ప్రాధమిక అవసరాలు... సమాజంలో ఈ మూడు అవసరాలు తీరిన తర్వాతే ఎవరైనా.. కానీ ఇప్పటికీ ఇవి తీరని ప్రజలు ఎందరో. అందుకే రాజన్న సంక్షేమ రాజ్యం తెస్తానంటున్న జగన్.. ఈ ప్రాధమిక అవసరాల కోసం పథకాలు రూపొందిస్తున్నారు.


ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని జగన్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు కల్పించాలని ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గత ప్రభుత్వాలు గృహ నిర్మాణ రంగంలో అంతులేని అవినీతి చేశాయని జగన్ చెబుతన్నారు.


ఆ అవినీతిని అరికట్టి.. అందరికీ ఇల్లు కట్టించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఇల్లు కావలసిన వారు ఈ క్రింద ఉన్న నమూనాలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తును గ్రామ పంచాయితీ కార్యదర్శి ద్వారా ఎంపీడీవోకు అందజేయవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: