తెలుగుదేశంపార్టీలో నుండి బిజెపిలోకి ఎంపిలు ఫిరాయించేటపుడు ఏపి ప్రయోజనాల కోసమే తాము పార్టీ ఫిరాయించినట్లు చెప్పుకున్నారు. తాజా బడ్జెట్లో ఏపి ప్రయోజనాలను కేంద్రప్రభుత్వం పూర్తిగా పక్కన పడేసిందన్నది వాస్తవం. మరి బడ్జెట్లో అన్యాయం జరిగిందని తెలిసినా ఫిరాయింపు ఎంపిల్లో ఎవరూ నోరెత్తటం లేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని అర్ధమైపోయింది.

 

ఈ నేపధ్యంలోనే ఫిరాయింపు ఎంపిలపై టిడిపి ఎంపి కేశినేని నాని సెటైర్లు వేస్తున్నారు. బిజెపిలోకి ఫిరాయించిన ఎంపిలు రాష్ట్రాన్ని ఉద్ధరించటానికి ఫిరాయించారా ? లేకపోతే తమను తాము ఉద్ధరించుకోవటానికి మాత్రమే పార్టీ ఫిరాయించారా ? అని సూటిగానే ప్రశ్నించారు.

 

నిజానికి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే. వీరిలో మొదటి ముగ్గురైతే చంద్రబాబుకు బినామీలుగా ప్రచారంలో ఉన్నవారు. అదే సమయంలో సుజనా, సిఎంలపై సిబిఐ, ఈడి, ఐటి కేసులు కూడా ఉన్నాయి.

 

కేసుల నుండి తప్పించుకునేందుకే ఎంపిలు పార్టీ ఫిరాయించారని అందరికీ తెలుసు. పైగా చంద్రబాబు అనుమతితోనే వాళ్ళు పార్టీ ఫిరాయించారనే ప్రచారమూ ఉంది. అందుకనే బడ్జెట్లో ఏపికి అన్యాయం జరిగినా నలుగురిలో ఏ ఒక్కరు కూడా నోరిప్పటం లేదు. తాజా పరిణామాలు చూస్తుంటే కేశినేని చేసిన కామెంట్లే నిజమనిపించటం లేదూ ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: