అర్థం కాకుండా మందులు గీకేయడం డాక్టర్ ప్రిస్కిప్షన్ ప్రథమ లక్షణం.. ఆ రాత మెడికల్ స్టోర్స్ వాళ్లకు తప్ప సామాన్యులకు అర్థం కాదు.. ఐతే.. కోదాడలోని ఓ డాక్టర్ మాత్రం వింత మందుల చీటీ రాశాడు. చక్కటి తెలుగులో అందరికీ అర్థమయ్యేలా రాశాడు.


కాకపోతే.. అలా రాసింది మందులు కాదు.. 2 లక్షలు నగదు, 3 లక్షల విలువైన బంగారం, 100గజాల ఇళ్ల స్థలం.. ఇవీ ఆ వింత డాక్టర్‌ రాసిన మందుల చీటీలోని వివరాలు. అదేంటీ మందుల చీటీలో ఇవెందుకు వచ్చాయి అంటారా.. అక్కడే ఉంది అసలు కథ.


సదరు డాక్టర్ తన దగ్గర పని చేసే ఓ నర్సుని లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. డాక్టర్ భార్య కు ఆ విషయం తెలిసి ఆ నర్సును ఉద్యోగం మాన్పించింది. విషయం పెద్దది కాకుండా ఆ నర్సును అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు ఆ డాక్టర్ . అందుకు నర్సు ఒప్పుకోలేదు. దీంతో రోగులకు మందులు రాసే చిట్టీ మీద తన ఇష్టపూర్తిగా రాసి ఇస్తున్నట్లు పలు హమీలు ఇచ్చాడు.


డాక్టర్ ప్రతిపాదనకు అంగీకరించి అబార్షన్ కోసం ఓ డాక్టర్ వద్దకు ఆ నర్సు వెళ్లింది. ఆ డాక్టర్ విషయం అంతా కూపీ లాగేసరికి ఆ నర్సు తనకు వైద్యుడు రాసి ఇచ్చిన హమీల చిట్టీని చూపించింది. ఇది ఎలా బయటకు వచ్చిందో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: