కేంద్రం బడ్జెక్ట్ లో మహిళలకు సముచిత ప్రాధాన్యం దక్కింది. డ్వాక్రా మహిళలకు అండగా నిలిచేందికు కేంద్రం వడ్డీ రాయితీ పధకం ప్రకటించింది. ముద్రయోజన పధకం ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు ఋణం అందించాలని నిర్ణయించింది.మరోపక్క స్వయం సహాయక గ్రూపులోని సభ్యులకు బ్యాంకులు నుంచి రూ.ఐదు వేలు వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కలిపించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రి నిర్మలసీతారామన్ ప్రకటించారు.

ఇదివరకు చిన్నతరహాలో పరిశ్రమలు.. కుటీర పరిశ్రమలు.. చిరువ్యాపారం చేసుకొనేవారు మాత్రమే "ముద్ర" రుణాలు బ్యాంకుల నుంచి లభించేవి. మారుతున్నా పరిస్థితుల దృష్ట్యా .. పెరుగుతున్న ధరల రీత్యా సగటు కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు శ్రమించాల్సి వస్తుంది. దింతో మహిళలు తమకు తెలిసిన పాడి పరిశ్రమ , కుట్టు, అల్లికలు, చిరువ్యాపారం తదితర రంగాల్లో ప్రతిపాదన చూపుతున్నారు. ఇటువంటి వారికీ ఆర్ధిక ప్రోత్సహం అందిస్తే .. ఇంతవరకు ఉపాధి కల్పించడంతో పాటు ఆ కుటుంబాలు కూడా ప్రగతి చెదనున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. ఆయా కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. మహిళా సంఘాల  సభ్యులు ఈ దఫా కేంద్ర బడ్జెట్లో వరం లభించింది. మహిళా సంగాల సభ్యులు తమ ఖాతానుంచి ఓవర్ డ్రాఫ్ట్ చేసుకొనే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: