పవన్ సుగుణాల పుట్ట అంటారు, ఆయన సమ సమాజ స్థాపకుడు అంటారు, తరతమ భేదం లేదని కూడా చెబుతారు. కులం, మతం రంగు రుచి వాసన ఏమీ తెలియని విశ్వ మానవుడు అంటారు. కానీ పవన్ రాజకీయాల్లోకి వచ్చాకే అసలు రంగు బయటపడింది. తన కులం వాళ్ళనే చుట్టూ పెట్టుకోవడం దగ్గర నుంచి పోటీ చేసిన రెండు సీట్లలోనూ తమ సామాజిక వర్గం దన్ను చూసుకునే పవన్  రంగంలోకి దిగారని కూడా అంతా అన్నారు.


అయితే పవన్ రంగు తెల్సిన జనం మాత్రం కులం రొచ్చులో పడలేదు. అందుకే రెండు చోట్లా పవన్ ఓడిపోయారు. ఇక పార్టీకి కూడా పట్టాల్సిన కులం గబ్బు బాగానే పట్టింది. ఎన్ని కబుర్లు చెప్పినా ఎంత ఆవేశపూరితమైన డైలాగులు వల్లించినా జనసేనలో పొలిటికల్ మెటీరియల్ లేదన్నది జనాలకు అర్ధమైంది. తాజా ఏన్నికల్లో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు.


సరే గెలుపు ఓటములు మామూలే. దానికి పవన్ చేసుకోవాల్సిన రిపేర్లు మానేసి మరోకరి మీద పడి బాధ పడడమే చేస్తున్న అసలు తప్పు. జగన్ గెలిచాడు అన్నది పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతలా అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంటూ  ప్రజా  తీర్పునే కించపరచేటంత. ప్రజా న్యాయస్థానంలో జగన్ కి జనం తీర్పు ఇచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన‌ ఏపీ సీఎం. అలా ఇలా కాదు బంపర్ మెజారిటీతో గెలిపించిన తరువాత కూడా పవన్ ఇంక జగన్ మీద ఆడిపోసుకొవడం అంటే దారుణమే.


 జైలుకు జగన్ ఎందుకు వెళ్ళారు. ఆ కధా కమామీష్ ఏంటన్నది పవన్ పక్కన ఉన్న జేడీ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకుంటే మంచిదని వైసీపీ నేతలు అంటున్నారు.  ఇక జగన్ మీద ఇపుడు ఉన్నది నింద. అది నిజమైన నాడు పవన్ ఇంకా పెద్ద గొంతుకతో ఆరోపణలు చేయవచ్చు. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న దాన్ని పదే పదే కెలికి  అవినీతిపరులు అనడం పవన్ లాంటి కొత్త రకం రాజకీయాలు కోరుకుంటున్న వారికి అంతగా బాగోదేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: