లోకేష్ తానేదో మేధావి మాదిరిగా ట్విట్స్ చేస్తున్నాని అనుకుంటున్నారు. కానీ వవ ట్వీట్స్ గురించి జనాల రియాక్షన్ మాత్రం పట్టించుకోవటం లేదు. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది.. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వుంది. వైసీపీ ఒంటరిగా పోటీ చేసి అధికారం దక్కించుకుంది. కేంద్రంలో ఇతర పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలోకి రావాల్సిన పరిస్థితులు వస్తే, అప్పుడు ఆ పరిస్థితిని ఉపయోగించుకుని ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెచ్చి, హోదాని సాధిస్తామని వైఎస్‌ జగన్‌, ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పారు.


అయినా, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయి.. జస్ట్‌ 45 రోజులు కూడా పూర్తికాలేదాయె. అప్పుడే, కేంద్రానికి వైసీపీ సాగిలా పడిందంటూ, నారా లోకేష్‌ ట్వీట్లతో చెలరేగిపోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన నారా లోకేష్‌, ఆ అసహనాన్నంతా తన ట్వీట్లలో చూపించేస్తున్నారు. ప్రత్యేకహోదా దండగ.. అని బీజేపీ కంటే ముందు చెప్పింది చంద్రబాబే. ఆ విషయాన్ని లోకేష్‌ మర్చిపోతే ఎలా.?


ట్వీట్లేసి పండగ చేసుకోవడమొక్కటే కాదు, ఆ ట్వీట్ల కింద జనం స్పందించే తీరుని కూడా నారా లోకేష్‌ తెలుసుకోవాల్సి వుంది. ప్రధానిని వైఎస్‌ జగన్‌ కలిసినప్పటి వీడియోల్ని లోకేష్‌ షేర్‌ చేయడం బాగానే వుంది.. మరి, గతంలో ఇదే ప్రధాని ముందు చంద్రబాబు వంగి వంగి దండాలెట్టిన సంగతేంటి.? జనంలోకి వెళ్ళడం, జనం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం.. ఇవీ నాయకత్వ లక్షణాలు. ట్విట్టర్‌లో కూర్చుని.. టైమ్‌ పాస్‌ చేయడం నాయకత్వమవుతుందని లోకేష్‌ అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: