కొన్ని విషయాలు అనుకోకుండా భలే జరుగుతుంటాయి.  మనం ఒకటి అనుకుంటాం.. అక్కడ మరొకటి జరుగుతుంది.  అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేలోపే అంతా పూర్తవుతుంది.  తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉన్నది.  


తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ ఓడిపోయారు.  ఆయన ఓటమి పాలవ్వడం టిడిపి గెలవడం జరిగిపోయాయి.  ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి అయ్యారు.  కాగా, 2019 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ గెలిచారు.  


టిడిపి ఓడిపోయింది.  ఓడిపోవడం అంటే అలా ఇలా కూడా కాదు.  అది దారుణమైన ఓటమి.  కేవలం టిడిపి 23 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది.  ఇన్ని తక్కువ స్థానాలు గెలుచుకోవడం టిడిపికి ఇదే మొదటిసారి. 
తెలుగుదేశం పార్టీకి వరసగా దెబ్బమీద దెబ్బ పడుతున్నాయి. 

తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన పయ్యావుల పార్టీ మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  వైకాపాలో జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి.  ఎందులో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: