సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జగన్మోహన్ రెడ్డిగారు గత 35 రోజుల్లో ఎన్నో మంచి పథకాలు అమలులోకి తెచ్చారు. కొన్ని పథకాలు ఇప్పటికే ప్రారంభం కాగా మరి కొన్ని పథకాలు అతి త్వరలో అమలులోకి రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పట్ల ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా ఇస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని ఇప్పటికే ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. వీటితో పాటు ఇవ్వని హామీలను కూడా కొన్ని నెరవేరుస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో కొన్ని ఇవ్వని హామీలను కూడా ఇచ్చినట్లు షేర్ చేస్తున్నారు. ఇది తెలియని అమాయకులైన ప్రజలు కొందరు దీనిని నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు. 
 
దీని వలన కొంతమంది అమాయకులైన ప్రజలలో ప్రభుత్వం హామీలు ఇవ్వకపోయినా ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేదనే భావన కలుగుతుంది. ప్రభుత్వం ఇవ్వని హామీల గురించి ఇస్తున్నట్లు ప్రచారం జరిగితే వెంటనే ప్రభుత్వం తరపున వాటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త వహిస్తే ఇలాంటి దుష్ప్రచారాలు జరగకుండా చేయవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: