కౌలు రైతులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం అగ్రికల్చర్‌ మిషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే కౌలు రైతులకు కూడా అండగా నిలవాలని జగన్ నిర్ణయించారు.


రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తామని... ఇందుకు అనుగుణంగా చట్టసవరణ చేసి కౌలు రైతులకు కార్డులు, పంటరుణాలు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకమూ రైతుకు చేరాలని జగన్‌ ఈ సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. రైతు సంతోషంగా లేకపోతే మన పాలన సరిగా ఉన్నట్లు కాదన్నారు.


అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి సమీక్షా సమావేశం వివరాలను వెల్లడిస్తూ ఇలా అన్నారు.. "తొలి సమావేశం బాగా జరిగింది. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వచ్చే సీజన్‌కు విత్తన సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.


మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు రైతు దినోత్సవం రోజు అమల్లోకి రాబోతున్నాయని, రైతు భరోసాలో ఇచ్చిన 12 హామీలను జూలై 8 నుంచి రైతు దినోత్సవం సందర్భంగా అమలు చేస్తాం.”


మరింత సమాచారం తెలుసుకోండి: