తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై పోరాటం చేయండని... నటించకండి అంటూ బీజేపీ  నేతలకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్  షా ఒకింత స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. "కేసీఆర్‌కు భయపడొద్దు. టీఆర్ఎస్‌తో దోస్తీ లేదు.. భవిష్యత్‌లో కూడా ఉండదు. తెలంగాణకు నెలకోసారి వస్తాను. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎన్నికల కోసం కాదు. తెలంగాణలో 51శాతం ఓట్ల కోసం పనిచేయాలి" అని ముఖ్యనేతలకు షా దిశానిర్దేశం చేశారు. భాగ్యనగరంలోని నోవాటెల్ హోటల్లో బీజేపీ కోర్ కమిటీ నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు.


 ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ తదితరులు హాజరయ్యారు.  తెలంగాణలో బీజేపీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం, ప్రజా సమస్యలపై పోరాటం, కొత్త నేతలను కలుపుకుపోవటం వంటి అంశాలపై చర్చించారు. అయితే బీజేపీ నేతలు కొత్తగా పార్టీలోకి వస్తున్న నేతలను కలుపుకువెళ్లడం లో ఘోరంగా విఫలమవుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి . గతం లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రిగా పనిచేసి , తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ లో చేరి , తన మాజీ సహచరుడైన కేసీఆర్ పై తీవ్ర స్థాయి లో పోరాటం చేసేందుకు సిద్ధపడినా ఆయనకు తెలంగాణ పార్టీ నాయకత్వం పెద్దగా సహకరించలేదన్న ఆరోపణలున్నాయి .


ఇక బీజేపీ తరుపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ విషయంలోనూ పార్టీ నాయకత్వం అవలంభిస్తున్న ధోరణి సరిగ్గాలేదని పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు . ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాలో టీఆరెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎలా ఎదుగుతుందన్న ప్రశ్న తెలెత్తుతోంది . బీజేపీ రాష్ట్ర నాయకత్వం మైండ్ సెట్ మారకపోతే అమిత్ షా ఎన్నిసార్లు తెలంగాణ లో పర్యటించినా ప్రయోజనం ఉండదన్న వాదనలు విన్పిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: