జగన్ ముఖ్యమంత్రిగా  బాధ్యత‌లు స్వీకరించారు. అయిదేళ్ళ పాటు బండిని నడపాలి. అధికారానికి ఆయన కొత్త. మంత్రుల్లో చాలా మంది కొత్త. ఇక పార్టీ, ప్రభుత్వల్మో సీనియర్లు ఉన్నారు. మరో వైపు టీడీపీ ప్రతిపక్ష పాత్రలోకి వచ్చింది.


డే వన్ నుంది జగన్ మీద పడి ఆరోపణలు ఉన్నవీ లేనివీ చేస్తూ నెల రోజులకే ఇది చాతగాని ప్రభుత్వం అని చంద్రబాబు అనేశారు. దీని మీద ఇపుడు జగన్ మండిపడుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ఎందరో సీనియర్లు ఉండి కూడా టీడీపీ ఆరోపణలను ఎందుకు  తిప్పికొట్టలేకపోతున్నరని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అంబటి రాంబాబు. రోజాలాంటి  వారు నోర్లు కట్టేసుకున్నారు. ఇక భూమన కరుణాకరరెడ్డి వంటి వారు మౌనం వహించారు. ఇలా సీనియర్ల సైలెంట్ మీద జగన్ ఫైర్ అవుతున్నారు. అదే విధంగా మంత్రులు సైతం ప్రతిపక్షం ఆరోపణలను సరిగ్గా తిప్పికొట్టడం లేదని జగన్ మధనపడుతున్నారు. అసలు పార్టీ, ప్రభుత్వంపై వ్యతిరేకంగా వస్తున్న వార్తల పైన కూడా స్పందించకపోవడంపైన జగన్ సీరియస్ అవుతున్నారని భోగట్టా. చూడాలి మరి జగన్ మార్క్ ట్రీట్మెంట్ ఉంటుందేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: