ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి' గారి జయంతి ఈ నెల 8వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగులో జరగనుంది. 'వైఎస్ రాజశేఖర్ రెడ్డి' గారి జయంతి సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జులై ఎనిమిదో తేదీని రైతు దినోత్సవంగా జరపనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ జయంతి నాడే వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారని ఇప్పటికే సోషల్ మీడియా వేధికగా వార్తలు వినిపిస్తున్నాయి. 


ఈ నేపథ్యంలోనే అదే రోజున చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని, గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అవినీతి పనులు అన్ని బయటకు రానున్నాయని సోషల్ మీడియా వేధికగా గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం అని, గత నలభై ఏళ్ళల్లో చంద్రబాబు చేసిన అవినీతి పనులన్నీ ఏపీ సీఎం వైఎస్ జగన్ కక్కించనున్నడని వార్తలు భారిగా వినిపిస్తన్నాయి. ఈ విషయంపైనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 


గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన పనులు అన్ని కొత్త ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేసారు. తమతో ఇప్పటికే 18మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, ఏపీలో త్వరలో టీడీపీ పోయి బీజేపీ ప్రతిపక్ష పార్టీగా మారనుందని సునీల్ దేవ్ ధర్ వ్యాఖ్యలు చేశారు. కాగా జైలుకు వెళ్లే విషయంలో ఇప్పటికే స్పందించిన చంద్రబాబు నన్ను ఎవరు జైల్లో పెట్టలేరు అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ జయంతి నాడే చంద్రబాబు చేతికి బేడీలు అనేది ఈ సంవత్సరమ లేక వచ్చే సంవత్సరమే అనేది చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: