ఆంధ్ర ప్రదేశ్ లో బలపడాలన్న బీజేపీ దూకుడు చూసి అధికార వైకాపా ఆందోళన చెందుతోంది . కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ, రాష్ట్రం లో  బలపడితే రాజకీయంగా తమకు నష్టమే తప్పితే ఒరిగేదేమి ఉండదన్న భావనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది . రాష్ట్రం లో  టీడీపీ ని  నిర్వీర్యం చేస్తే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉండడంతో , టీడీపీ నుంచి నేతల వలసలను , పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కంటే వాటికి దూరంగా ఉండడమే బెటరన్న నిర్ణయానికి వైకాపా నాయకత్వం వచ్చినట్లు సమాచారం .


బెంగాల్ , ఒడిశా అనుభవాలను పరిశీలించిన  వైకాపా నాయకత్వం , రాష్ట్రం లో ప్రాంతీయ పార్టీ అయినా టీడీపీ మనుగడలో ఉండడమే తమకు సేఫ్ సైడ్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  గత ప్రభుత్వం తరహా లో కాకుండా తాము ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యత ను ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోపాటు మంత్రుకు  పేర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .


తెలుగు రాష్ట్రాల్లో బలపడే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తోన్న బీజేపీ నాయకత్వం, ఇప్పటికే తెలంగాణ లో అధికార టీఆరెస్ ను టార్గట్ చేస్తోంది . అధికార పార్టీతో పోరాటం చేయండి ... నటించవద్దని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర బీజేపీ ఇచ్చిన హెచ్చరిక పరిశీలిస్తే , బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని ఎంత ఆరాటపడుతుందో ఇట్టే అర్ధమవుతోంది . బీజేపీ దూకుడు చూసి వైకాపా నాయకత్వం, టీడీపీ ని రాజకీయంగా దెబ్బ తీయాలన్న తమ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: