కృష్ణ, విజయనిర్మల.. ఈ రెండు పేర్లనూ విడదీసి చూడలేం. అంతగా ప్రేమ బంధంతో అల్లుకుపోయిన పేర్లు అవి. సినిమాలతో జతకట్టి.. ఆ జతను నిజ జీవితంలోనూ నిజం చేసుకున్న ప్రేమ జంట ఇది. అలా అలా దాదాపు 45 సినిమాల్లో ఈ జోడీ జంటగా నటించి రికార్డు సృష్టించింది.


అయితే ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఒకటుంది. కృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ప్రేమలో ఉన్న సమయంలోనే.. పెళ్లి చేసుకుందామనుకుంటున్న సమయంలోనే వాళ్లిద్దరూ కొన్ని సినిమాల్లో అన్నాచెళ్లెళ్లుగానూ నటించాల్సి వచ్చింది. నిర్మాత డి. రామానాయుడు గారి సినిమా ‘బొమ్మలు చెప్పిన కథ’ నిర్మల కృష్ణకుచెల్లెలుగా నటించింది.


ఆ సినిమా చూసి చాలా మంది.. ఏమయ్యా! ఈ టైములో ఇలా చేశారు అంటూ కామెడీగా కామెంట్ చేశారట. అంతే కాదు.. కాస్త అటూ ఇటూగా 1969-70 సమయంలోనే మంచిమిత్రులు, ముహూర్తబలం, వంటి సినిమాల్లో కూడా అన్నాచెళ్లెళ్లుగా నటించారట. ప్రేమలో ఉండగానే.. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తర్వాత కూడా అన్నాచెళ్లెళ్లుగా నటించడం విచిత్రమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: