విజయనిర్మల.. తెలుగు సినీ చరిత్రలో ఓ ఆణిముత్యం.. ప్రత్యేకించి పురుషాధిక్యత, హీరోల పెత్తనం ఎక్కువగా ఉండే తెలుగు సినీరంగంలో ఓ మహిళ నిలదొక్కుకున్న తీరుస్ఫూర్తిదాయకం . ఓ నటిగా, దర్శకురాలిగా విభిన్నరంగాల్లో తనదైన సాధికారత చూపించారు.


ప్రపంచంలోనే మరే మహిళా దర్శకత్వం వహించనన్ని సినిమాలు ఆమె దర్శకత్వంలో వచ్చాయి. ఇన్ని ఘనతలు సాధించిన ఓ మహిళాదర్శకురాలికి ప్రభుత్వాల పరంగా తగినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. అయితే విజయ నిర్మలకు పద్మవిభూషణ్ ఇవ్వాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనుకున్నారట.


ముందుగా నటశేఖర కృష్ణకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పద్మభూషణ్ ఇప్పించారట. ఆ తరువాత కొన్నాళ్లకు విజయనిర్మలకు కూడా ఇప్పించాలని అనుకున్నారట. కానీ ఇంతలోనే వైఎస్ మరణించారు.. ఈ విషయాలను కృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.


ఇప్పుడు అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. మరి తండ్రి పూర్తి చేయాలనుకున్నపనిని ఇప్పుడు తనయుడు జగన్ చేస్తాడా.. చూడాలి.. ఈ విషయంలో కృష్ణ కుటుంబం చొరవ తీసుకుంటే.. జగన్ కూడా సహకరించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏమవుతుందో.?


మరింత సమాచారం తెలుసుకోండి: