ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేరు చెప్పగానే వెంటనే వినిపించేది సంచలన నిర్ణయం. అవును సంచలన నిర్ణయానికి మరో పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గత 9 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు చెప్పండి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఇప్పటి వరుకు స్వార్ధంలేని ఇలాంటి నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు చెప్పండి. స్వార్ధంలేని ముఖ్యమంత్రులు ఎవరు లేరు, లాభం ఉంటేనే నిర్ణయాలు తీసుకునే వారు మాజీ ముఖ్యమంత్రులు.  


పుట్టిన పసికందు నుంచి అవ్వ, తాతల వరుకు ప్రతి ఒక్కరికి పథకాల లాభాలు అందేలా, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు జగన్ అన్న. ఈ నేపథ్యంలోనే రాజధాని విషయంలోనూ ఒక కీలక నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీసుకోనున్నారట. ఆ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం లాభపడుతాయట. అమరావతి  రాజధాని మార్పు జరుగుతందని పార్టీ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందనుకొన్నట్టుగా 'దోనకొండను' ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మార్చే దిశలో వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారట. 


రాష్ట్ర విభజన సమయంలో దోనకొండను రాజధానిగా ఎంపిక చేస్తే చంద్రబాబు తన స్వార్ధం కోసం అమరావతిని రాజధాని చేసారని, అయితే ప్రభుత్వం, ప్రజలు లాభం పొందేందుకు దోనకొండను రాజధానిగా చెయ్యాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ముందుచూపు ఉన్న వైసీపీ నేతలు దోనకొండలో భూములు కోంటున్నారాని వస్తున్న వార్తలు రాజధాని మార్పుపై వస్తున్న గుసగుసలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ రాజధాని మారుస్తే ప్రజలకు లాభం ఏంటి ? ప్రతిపక్ష నేతలకు నష్టాలు ఏంటి ? అనేది వాళ్ళు స్పందించే విధానంలోనే తెలిసిపోతుందిలెండి. రాజధాని మార్పు నిజామా ? కదా అనేది త్వరలోనే తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: