రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన తరువాత ఫ్రీగా తిరుగుతున్నారు.  ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా తిరుగుతున్నారు.  మొన్నటి మొన్న ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్లో సామాన్య ప్రేక్షకుడిలా ఆర్టికల్ 15 సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు.  


ఆ సినిమా చూస్తున్నంత సేపు పాప్ కార్న్ తింటూ.. పక్కనున్న ప్రేక్షకులతో మాట్లాడుతూ ఎంజాయ్ సినిమా చూశారు.  తలపై ఉన్న జాతీయ అధ్యక్షుడి భారాన్ని పక్కన పెట్టడంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇదిలా ఉంటె, కోర్ట్ నుంచి బయటకు వచ్చిన తరువాత మధ్యలో ఆగి ఓ పనిచేశాడు.  


అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రాహుల్ మధ్యలో ఆగి సాధారణ రెస్టారెంట్ కు వెళ్లి దోశ తిని కాఫీ తాగారు.  తనతో పాటు మిగతా నాయకులు కూడా ఉన్నారు.   ఏ మాత్రం హడావుడి లేకుండా బందోబస్త్ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నారు.  


ఎప్పుడు చుట్టూ 10 మంది ప్రొటెక్షన్ తో హడావుడిగా కనిపించే రాహుల్ ఇలా సడెన్ గా సామాన్యుడిగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.  అధ్యక్షుని పదవి అలంకరించడం అంటే మామూలు విషయం కాదు.  చాలా బాధ్యతతో కూడుకొని ఉంటుంది.  మరి చూద్దాం ఏం జరుగుతోందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: