జేసి దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో కీలక నేతల్లో ఒకరు.  గతంలో కాంగ్రస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.  మంత్రిగా కూడా పనిచేశారు.  2014 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీగా పనిచేశారు.  కాగా, 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు.  ఆ కుటుంబం నుంచి ఇద్దరు పోటీ చేయగా ఇద్దరు ఓడిపోయారు.  


దీంతో జేసి దివాకర్ రెడ్డి పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టారు.  తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి.  అనంతపురం జిల్లా నుంచి భారీగా వలసలు ఉంటాయని వార్తలు వచ్చాయి.  ఇప్పటికే కొంతమంది బీజేపీలో జాయిన్ అయ్యారు.  


పార్టీ మార్పు వార్తలు వస్తున్నా దానిపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు.  పైగా తెలుగుదేశం పార్టీతో ఆయన టచ్ లోనే ఉన్నారు.  జేసీ దివాకర్ రెడ్డి రాజకీయాలకు దూరం అవుతున్నాని చెప్పినా ఈ మధ్యన జరిగినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మీటింగులో దర్శనమిచ్చారు. ఆయన తనయుడు టీడీపీ పార్టీ తరపున వైసీపీను పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న వీడియో ఒకటి బయటకు రాగా అందులో జేసీ కూడా ఉన్నారు.


దీన్ని బట్టి ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళేదే లేదని ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండేందుకు నిర్ణయించుకున్నారని మరో కోణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో లేవనెత్తింది.మరి జేసీ ఫ్యూచర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నా, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: