మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మోడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పావులు కదిపారా.. బీజేపీని ఓడించేందుకు విపరీతంగా డబ్బు ఖర్చు చేశారా.. స్టాలిన్, మమతాబెనర్జీ, మాయావతిలకు కేసీఆర్ ఎన్నికల కోసం నిధులు సమకూర్చారా.. అవునంటోంది ఓ ప్రముఖ దిన పత్రిక.


తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌కు, ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి , కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమార స్వామికి, కేసీఆర్‌ ఆర్థిక సహాయం చేశారని బీజేపీ నాయకత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందని ఆ పత్రిక తన సంపాదకీయంగలో రాసుకొచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రాంతీయ పార్టీల నాయకుల మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆలోచనతోనే కేసీఆర్‌ వారికి ఆర్థిక సహాయం చేశారట.


ఈ విషయం పసిగట్టిన బీజేపీ పెద్దలు ముందుగా కేసీఆర్‌ పని పట్టాలని నిర్ణయించుకున్నారట. అందుకే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో గెలవగానే తెలంగాణపై దృష్టి సారించారట. ఈ డబ్బు పంపిణీ వ్యవహారం వల్లే ఎన్నికల ముందు వరకు ఉభయ పక్షాల మధ్య సంబంధాలు సజావుగానే ఉన్నా.. ఆ తర్వాత చెడిపోయాయని ఆ పత్రిక అంచనా వేసింది. మరి ఈ వాదనలో ఎంతవరకూ నిజం ఉందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: