ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీకి అధికారం అసాధ్యం అనుకున్న త్రిపుర, అస్సాం, హర్యానా, మహారాష్ట్ర లో అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ లో బీజేపీ పుంజుకుంటుందన్నారు.

 

రాబోయే రోజుల్లో ఏపీ లో అధికార పార్టీకి పోటీ ఇవ్వబోయేది బీజేపీయే అన్నారు. తన పరిస్థితి చుసుకోకుండా , కేంద్రంలో చక్రం తిప్పుతా, మోదీని దించేస్తా అంటూ దేశం మొత్తం తిరిగిన చంద్రబాబు పరిస్థితి ఏం అయిందో అందరూ చూసారన్నారు. కుటుంబ పాలనకు, కుల రాజకీయాలు, మత రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్నారు.

 

దేశం మొత్తం గుణాత్మకమైన మార్పు తెస్తా అన్న కేసీఆర్, తన కూతురుని గెలిపించుకోలేకపోయారన్నారు. తెలంగాణ లో బీజేపీ కి ఒక సీటు కూడా రాదని ప్రచారం చేశారు. కానీ 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో పరిస్థితి ఏపీ లో కూడా రాబోతుందన్నారు.

 

పోలవరం తో పాటు ఏపీ అభివృద్ధి కి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అదే తాము అధికారంలో ఉంటే గనుక, ఇరు తెలుగు రాష్ట్రాలకు బంగారు భవిష్యత్తు కట్ట బెడతామని, పేదలకు ఉచిత విద్య, వైద్య, వ్యాపారాలని ఫ్రీగా అందుబాటులో ఉంచుతామని బల్లగుద్ది మరి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: