అమెరికాకు భారత్ ఝలక్ ఇచ్చింది. భారత్ నుంచి దిగుమతయ్యే అల్యూమినియం వస్తువుల మీద గత మార్చిలో సుంకాన్ని పెంచింది. దీంతో భారత్ కూడా అమెరికాకు షాక్ ఇస్తూ యూఎస్ నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది.

 

అమెరికాలో ఉత్పత్తి చేసినవి లేదా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద ఈ దిగుమతి సుంకం వర్తిస్తుంది. పెరిగిన ఇంపోర్ట్ డ్యూటీ జూన్ 16 నుంచి అమల్లోకి వస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద దిగుమతి సుంకం తగ్గించాల్సిందిగా అమెరికాను పలుమార్లు విజ్ఞప్తి చేసింది.

 

ఇటీవల ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చల సందర్భంగా కూడా ఈ చర్చ జరిగింది. కానీ, అగ్రరాజ్యం నుంచి ఎలాంటి సానకూల స్పందన రాలేదు. అందువలన భారత్ ఎప్పటిలానే ఎగుమతి చేసే వస్తువుల మీద సుంకం యధావిధిగా పెంచింది. ఈవిషయంలో ట్రంప్ భారత్ పైన గుర్రుగా వున్నారు. అయితే, ప్రపంచంలో సోషల్ మీడియాలో అత్యంత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీది రెండో స్థానం.

 

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో 110,912,648 ఫాలోయర్లు ఉన్నట్టు SEMrush సంస్థ లెక్క తేల్చింది. మొదటి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. నెట్టింట్లో ఈ విషయం వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: