రాజకీయం విచిత్రంగా మారిపోతోంది. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున గెలిచిన ముగ్గురు నేతలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఓడిపోయిన వైసిపి నేతలు కోర్టులో వేర్వేరుగా కేసులు వేయటం సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, గుంటూరు జిల్లాలోని గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఎల్ఏలపై కోర్టులో కేసులు పడ్డాయి.

 

పెద్దాపురంలో వైసిపి అభ్యర్ధి తోట వాణిపై టిడిపి తరపున పోటీ చేసిన మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో వైసిపి అభ్యర్ధి ఆమంచి కృష్ణమోహన్ పై కరణం బలరామ్, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి చంద్రగిరి ఏసురత్నంపై  టిడిపి అభ్యర్ధి మద్దాళిగిరి గెలిచిన విషయం తెలిసిందే.

 

ఇక్కడ విషయం ఏమిటంటే టిడిపి అభ్యర్ధులు నామినేషన్ల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు ఇవ్వటంతో పాటు కొన్ని వివరాలను దాచిపెట్టారని వైసిపి నేతలు కోర్టుల్లో కేసులు వేశారు. వైసిపి నేతలు వేసిన కేసులను కోర్టులు విచారణకు తీసుకోవటంతో తొందరలోనే టిడిపి ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడటం ఖాయమంటున్నారు.

 

చినరాజప్పేమో తనపై నమోదైన కేసులను దాచిపెట్టారని వాణి అంటున్నారు. అలాగే బలరామ్ రెండో భార్య, సంతానం విషయాన్ని దాచిపెట్టారంటూ ఆమంచి ఆరోపిస్తున్నారు. చివరగా మద్దాళి గిరిపై పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను దాచిపెట్టారని తన కేసులో వివరించారు. ఇప్పటికే గుంటూరు, శ్రీకాకుళం ఎంపిల గెలుపై కోర్టులో  విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. వాళ్ళపై దాఖలైన కేసుల విషయంలో కోర్టు గనుక వ్యతిరేకంగా స్పందిస్తే పాపం చంద్రబాబునాయుడు సంగతి గోవింద.


మరింత సమాచారం తెలుసుకోండి: