ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఉద్యమంగా సాగిన సమైఖ్యాంధ్ర, స్పెషల్‌ స్టేటస్‌ ఉద్యమాలు ఎన్నికల హోరు... ఫలితాల జోరులో సద్దుమనిగిపోయింది. మరలా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా మరోసారి స్పెసల్‌ స్టేటస్‌ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చేందుకు కార్యాచరణ చేపట్టింది. కాగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) మాత్రం స్పెషల్‌ స్టేటస్‌పై పెదవి విప్పడంలేదు.


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన సీపీఐ పార్టీ మీటింగ్‌లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కల ప్రత్యేక హోదా సాధన ముఖ్యమని దాన్ని సాధించే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పోరాటం కార్యక్రమం చేస్తుందన్నారు. 


మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం చేయడంలో కూడా ఆయన మొండి  వైఖరి ఉందని ఆయన తెలియజేశారు ఆ పద్ధతిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడనాడి ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని హోదాసాధన  ఉద్యమ బాట చేపడితే  హోదా సాధించగలమని ఆయన తెలియజేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: