చంద్రబాబు  ఇపుడు టార్గెట్ అయిపోయారు. ఎన్నడూ రాజకీయంగా ఎన్నడూ  ఎదుర్కోని విషమ పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో మోడీ ఉన్నారు. తెలంగాణాలో కేసీయర్ రెడీగా ఉన్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి చుక్కలు చూపిస్తున్నారు. మరి ఇటువంటి విషమ పరిస్థితి బాబు మొత్తం  పొలిటికల్ కెరీర్లో ఎన్నడూ లేదు.


ఇదిలా ఉండగా అధికారంలోకి వస్తూనే జగన్ బాబు మీదనే కత్తులు దూస్తున్నారు.  ఓ వైపు పాలన చక్కబెడుతూనే మరో వైపు బాబు  అయిదేళ్ళ పాలనలో అవినీతిని వెలికితీసేందుకు గట్టిగా పరిశ్రమిస్తున్నారు. ఈ విషయంలో జగన్ కొంతవరకూ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. పోలవరం, రాజధాని సహా కీలకమైన ప్రాజెక్టుల విషయంలో జగన్ లోతుగా సమీక్షలు చేస్తున్నారు.


వాటి ఫలితాలు వచ్చేసరికి మరో పది రోజులు పడుతుందని అంటున్నారు. బాబుని ఇరికించే కీలకమైన ఆధారాలు జగన్ కి చేతిలోకి వస్తాయని అంటున్నారు. అవి రాగానే జగన్ తీసుకునే కఠిన నిర్ణయం మీదనే అందరి ద్రుష్టి ఉంది. గతంలో ఎన్ని సార్లు తప్పించుకున్నా ఈసారి బాబు తప్పించుకోలేడని అంటున్నారు. మరి ఈ కధా కమామీషు  ఏంటో రాజకీయ వెండితెర పై చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: