తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  నియంత్రించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండటంతో కళాశాల, పాఠశాల విధ్యార్థులే టార్గెట్‌గా గంజాయి ముఠాలు తమ చీకటి వ్యాపారాన్ని యదేచ్చగా నిర్వహించుకుంటున్నారు. ఒకటి అర కేసులతో పోలీసులు మమ అనిపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆంధ్రా - ఒడిస్సా బోర్డల్‌లో గంజాయి సాగు ఎక్కువగా సాగుతున్నట్టు నిఘావర్గాల సమాచారం. కాగా ఆ ప్రాంతంపై పట్టు సాదించేందుకు ప్రభుత్వాలుగాని, పోలీసులుగాని చిత్తశుద్ది చూపటంలేని విమర్శలు వస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలోనికి వెళ్లేందుకు వీలులేదంటూ చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబడుతున్నారు.


ఏజన్సీ ప్రాంతం నుంచి ప్లైన్‌ ఏరియాకు వచ్చే మార్గంలో వందలాది చెక్‌పోస్ట్‌లు ఉన్నప్పటికీ పోలీసులు, అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు దుయ్యబడుతున్నారు. అటవీ ప్రాంతంలో ఉత్పత్తి అయిన గంజాయి పట్టణ, నగరాల్లో మార్కెట్‌ అవుతుండటం ఆయా ప్రభుత్వ సంస్థల పనితీరుకు అద్దం పడుతోంది. 
ఇటీవల విజయవాడలో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం మరో గంజాయి వ్యాపారిని అన్నవరం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.


సి.ఐ ఎఎస్‌ రావు తెలిపిన వివరాల ప్రకారం .... అన్నవరం సత్యదేవ లాడ్జిలో ఎస్ ఐ రావూరి మురళీమోహన్ సిబ్బందితో తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి  గంజాయితో పట్టుబడ్డాడు. ఆరు ప్యాకెట్లతో కూడిన 15 కేజీల  గంజాయ్ అమ్మకానికి సిద్ధం చేసుకుంటున్న మునిసబ్‌వీధికి చెందిన వనపర్తి భరత్ కుమార్ (25)ను అదుపులోనికి తీసుకున్నారు.  శంఖవరం మండలం తాసిల్దార్ సుబ్రహ్మణ్య చారి సమక్షంలో పట్టుబడిన గంజాయిని స్వాధీనం చేసుకుని ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: