బిజెపి అగ్రనేతల్లో ఒకరైన రామ్ మాధవ్ కు అమెరికాలో  పెద్ద అవమానమే జరిగింది. తెలుగువాడైన రామ్ ను తానా సభల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. సో, తానా నిర్వాహకుల ఆహ్వానం మేరకే వెళ్ళినా అక్కడ తీరని అవమానం ఎదురైంది. రామ్ మాధవ్ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఒకటే గందరగోళం చోటు చేసుకోవటంతో పాటు మాధవ్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకోవటంతో వేదిక మీద నుండి దిగిపోయారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే తెలుగుదేశంపార్టీని పుట్టి ముంచేందుకు బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.  అందులో రామ్ మాధవే కీలక పాత్రదారి. మొన్నటి ఎన్నికల్లో ఎప్పుడైతే ఘోరమైన అవమానం ఎదురైందో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగిలింది. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకపోవటంతో చాలామంది నేతలు పార్టీని వదిలిపెట్టేసే ఆలోచనలో ఉన్నారు.

 

ఈమధ్యనే టిడిపికి చెందిన ఆరుగురు రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించటంలో కూడా రామ్ ప్రధాన పాత్రపోషించారు.  అప్పటి నుండి ఒక్కక్కుళ్ళుగా టిడిపిని వీడి బిజెపిలో చేరిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అమెరికాలోని తానా అంటే టిడిపికి అనుబంధ సంస్ధా అన్నట్లుగా అయిపోయింది చాలా కాలంగా.

ఇటువంటి సభలకు రామ్ మాధవ్ వెళ్ళి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటంతోనే సమస్య మొదలైంది. నరేంద్రమోడిని ఆకాశానికి ఎత్తేయటాన్ని సభలో చాలామంది సహించలేకపోయారు. అమెరికాలో ఉన్న వాళ్ళల్లో చాలామంది కమ్మ సామాజికవర్గం వాళ్ళు చంద్రబాబుకు వీరాభిమానులు. ఆ విషయాన్ని తెలుగువాడయ్యుండీ రామ్ మరచిపోయారు. అదే సమయంలో నిర్వాహకులు కూడా ఆ విషయం తెలిసీ రామ్ మాధవ్ ను ఎలా పిలిచారో అర్ధం కావటం లేదు. చూస్తుంటే కావాలనే పిలిచారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: