జనసేనుడు జనల కోసం మధ్యవర్తిగా మారాడట.. అన్నయ్యను మళ్లీ రాజకీయాల్లోకి తీసుకురానున్నారట. వాషింగ్టన్ వేదికగా కొణిదెల వారి చర్చలు జరుగుతున్నాయి. 2008లో అన్న చిరంజీవి వైఎస్ రాజేశేఖర్ రెడ్డి గారికి పోటీగా ప్రజారాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించి గోరా పరాజయం పాలై 2011లో కాంగ్రెస్ లో విలీనం అయినా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు, అప్పుడే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కట్ చేస్తే 2014 లో మళ్లి కొణిదెల వారి ఇంటినుండి మరో పార్టీ. 


అదే పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన పార్టీ జనసేన. 2014 లోనే పార్టీ స్థాపించిన ఇప్పుడే నేను పోటీ చెయ్యను ఇప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్న, 2019లో పోటీ చేస్తా అన్నారు, అలాగే చేసారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని భారీగా తరలి వచ్చారు నేతలు. అన్న నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా 'నా షో నా ఇష్టం' అంటూ కొన్ని ప్రోగ్రాములు కూడా చేసారు అనుకోండి. ఆ కొన్ని రోజుల పనికి నాగబాబుకి సీట్ ఇచ్చి పోటీ చేపించి, ఓటమి రుచిని చూపించారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన పార్టీ కూడా త్వరలో బై బై చెప్తుంది అనుకున్నారు తెలుగు ప్రజలు. 


ఆలా అనుకోవడం మీ ముర్కత్వం అని ప్రజలకు తెలిసేలా, జనసేన పార్టీకు ప్రత్యేక పత్రిక పెడుతున్నాం అని అన్నారు. కొణిదెల వారు సినిమాలలోనే కాదు రాజయికీయాలలో కూడా రాజులే అని నిరూపించుకోడానికి పెద్ద ప్లాన్ ఏ వేసాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన చిరంజీవి అన్నను తిరిగి తీసుకొస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిగా మరి చిరంజీవి అన్నను బీజేపీలోకి తోస్తున్నారట. రేపొద్దున అన్నయ్య బీజేపీలో ఉంటే జనసేన, బీజేపీ కలిసి పోటీ చెయ్యచ్చని వాషింగ్టన్ వేదికగా ఓ పక్కా ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ వేసిన ఈ ప్లాన్ అయిన హిట్ అవుతుందా లేక 2019 ఎన్నికల్లనే అట్టర్ ప్లాప్ అవుతుందా అనేది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: