లేదని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముక్తకంటం తో చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పార్టీతో కలవడం గానీ, విలీనం గానీ జరగదని.. జనసేనాని స్పష్టం చేసారు. గతంలో తాను భాజపాతో కలిసి పనిచేశానని...ఆ పార్టీతో వ్యక్తిగత గొడవలేమి లేవని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టతివ్వమని కోరుతున్నానే తప్ప...వ్యక్తిగతంగా భాజపాతో తనకు సమస్య లేదని వ్యాఖ్యానించారు.

 

తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన ఆదివారం ఓ తెలుగు వార్తా ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘‘భాజపా ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా జనసేనను ఆ పార్టీలో విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట కదా’’ అని ఆ విలేకరి అడగ్గా..అలాంటిదేమీ లేదని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు.

 

‘‘భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో మీరు భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది’’ అన్న మరోప్రశ్నకు.. ‘‘అవునా! అలా ఉందా? అలా అంటున్నారా?’’ అని నవ్వుతూ ఎదురు ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే నేను కాదు..ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే. అమెరికా, ఐరోపా, గల్ఫ్‌ దేశాల్లో త్వరలో పర్యటిస్తా. అక్కడ తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటా..

 

భారత్‌కు వెళ్లిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తాం’’ అని పవన్‌ అన్నారు. నేను స్వీయ రాజకీయలబ్థి చూసుకుంటే తెదేపా, భాజపాలతో ఎందుకు గొడవ పడతాను. గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా’’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓటమిని తాను అవమానంగా భావించట్లేదని వ్యాఖ్యానించారు. అమెరికాలోని వర్జీనియాలో జనసేన అభిమానులైన ప్రవాసాంధ్రులు నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: