ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది.  అధికార టీడీపీ ఘొర వైఫల్యం పొందింది.  ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల కష్టాలు దగ్గరుండి చూసిన వైఎస్ జగన్ నేను విన్నాను..నేను ఉన్నాను అన్న భరోసా ఇవ్వడంతో ఏపి ప్రజలు వైఎస్ జగన్ కి జై కొట్టారు.  దాంతో ఏపిలో కనీ వినీ ఎరుగని రీతిలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. 

ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్ నేడు ఆయన సొంత జిల్లాలో పర్యటించబోతున్నారు. నేడు  ప్రత్యేక విమానంలో కడప చేరుకోనున్న జగన్, నేరుగా ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. తర్వాత గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో పులివెందులలో వైఎస్సార్ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలోఆయన మాట్లాడుతారు. . ఈ సభలో వైఎస్సార్ పింఛను కానుక, రైతులకు లబ్ది చేకూర్చే పలు ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. కాగా, ప్రతి సంవత్సరం జూలై 8న రాష్ట్రంలో రైతు దినోత్సవం జరిపేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: