అనిశ్చితి రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నది కర్ణాటక రాజకీయం.  కర్ణాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  2018 లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన సీట్లు రాలేదు.  దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 


సంవత్సరం తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది.  కర్ణాటకలో రాజకీయాలు మారిపోతున్నాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు రాజీనామాలు చేశారు.  అటు జేడీఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారు.  రెండు పార్టీలు అధికారంలో ఉన్నా తమ పార్టీ నేతలకు కాపాడుకోవడంలో విఫలం అయ్యాయని చెప్పొచ్చు.  


రాజకీయాల్లోకి రావాలి అనుకునే వారు దీనిని ఓ మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు.  రాజకీయాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.  ఎలాంటి ఒత్తిడులు వస్తాయి.  వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు కర్ణాటకలో ఇప్పుడు కొన్నాళ్ళు ఉంటె బోధపడుతుంది.  నిజంగా ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీవైపు ఎమ్మెల్యేలు ఉంటారు.  


కర్ణాటకలో మాత్రం విరుద్ధంగా జరుగుతున్నది.  కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి, జేడీఎస్ లో అసమ్మతి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం మార్పు దిశగా పయనిస్తోంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అక్కడ ఉంటుందా లేదంటే మార్పులు వస్తాయా అన్నది కొద్దిసేపట్లోనే తేలిపోతుంది.  మంత్రి వర్గాన్ని విస్తరించి బుజ్జగించాలని చూస్తోంది.  మరి ఇది సాధ్యం అవుతుందా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: