దేశంలో అత్యున్నత విధాన నిర్ణయాలకు చర్చా వేదిక అయిన పార్లమెంటు ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం పెట్టాలని వైసిపి డిమాండ్ చేస్తోంది. మచిలీపట్నం వైసిపి ఎంపి వల్లభనేని బాలశౌరి లోక్ సభ స్పీకర్  ఓం బిర్లాకు లేఖ రాశారు. మామూలుగా దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన నేతలకు మాత్రమే లోక్ సభ ప్రాంగణంలో విగ్రహాలు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది.

 

బాలశౌరి లేఖ ప్రకారం రూపాయి డాక్టర్ గా వృత్తిని ప్రారంభించిన వైఎస్ సిఎం అయిన తర్వాత పేద విద్యార్ధులకు ఫీజుల రీయింబర్స్ మెంటు, పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ లాంటి ప్రజారంజక పథకాలు పెట్టారు కాబట్టి వైఎస్ విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించాలని కోరారు. వైఎస్సార్ విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టటమే ఆయనకు నిజమైన గౌరవంగా బాలశౌరి అభిప్రాయపడ్డారు.

 

వైఎస్సార్ పథకాలనే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని బాలశౌరి చెప్పినా అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం నరేంద్రమోడినే అన్న విషయం అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టటానికి మోడి అంగీకరించేది అనుమానమే.

 

ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధించిన అఖండ విజయాన్నే మనస్పూర్తిగా ఆభినందించలేని స్ధితిలో మోడి ఉన్నారు. అలాంటిది జగన్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ ఇమేజిని మాత్రం మోడి అంగీకరిస్తారా ? రేపు జగన్ ఎలా దెబ్బకొట్టి అధికారంలోకి రావాలా అని ఆలోచిస్తున్న మోడి వైఎస్ విగ్రహాన్ని పెట్టి కోరి కొరివితో తల గోక్కుంటారని ఎవరూ అనుకోవటం లేదు. ఎన్టీయార్ విగ్రహం ఏర్పాటు అంశమే దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: