ఏపీ కి ప్రత్యేక హోదా.. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు భారత దేశం ఇచ్చిన హామీ.. కానీ ఇది ఇప్పటికీ నెరవేరడం లేదు. ప్రత్యేక హోదా సాధించలేక మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి ప్రత్యేక హోదా అంటూ ప్లేటు ఫిరాయించారు.


ఆయన మాటలు జనం నమ్మలేదు. ఇప్పడు జగన్ సీఎం అయ్యారు. మరి ఇప్పుడైనా జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారా అంటే.. కష్టమే అంటున్నారు బీజేపీ నాయకులు.. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఏమి సాదించారో చూశాం..ఇప్పుడు జగన్ కూడా అదే కోరుతున్నారు.. ఆయన ఏమి సాధిస్తారో చూద్దాం అంటున్నారు.


ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిదులు ఇవ్వలేదని కొందరు ప్రచారం చేస్తున్నారని అది తప్పు అని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజధానికి కేంద్రం రెండువేల కోట్లు ఇచ్చిందంటున్నారు వీర్రాజు. రాజధాని ప్రాంతంలో ఇంటర్నల్ రోడ్లకు ఇరవైవేల కోట్లు ఇస్తోందని ఆయన చెప్పారు.


కేంద్రమే ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మిస్తుందని వీర్రాజు అంటున్నారు. కనకదుర్గమ్మ గుడిపైకి వెళితే కేంద్ర నిధులతో కడుతున్న ఫ్లైఓవర్లు కనిపిస్తాయని ఆయన చెప్పారు. మరి ఇంతకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేయవచ్చు కదా..అంటే మాత్రం సమాధానం వినిపించదు.


మరింత సమాచారం తెలుసుకోండి: