దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మహానేత శ్రీ ఏడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి గారి 70వ జయంతి వేడుకలు నేడు ఆంధ్రప్రదేశ్ లోని ఊరూరా ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. ఇక నేడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులయలోని వైఎస్సార్ సమాధివద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఇక నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసిపి నాయకులూ మరియు వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. నిజానికి నాటి ఆంధ్రప్రదేశ్ తోలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి గారి దగ్గరినుండి నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వరకు ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి ఎనలేని విశేష సేవలు అందించినప్పటికీ, 

వారిలో వైఎస్సార్ గారు కొంత ప్రత్యేకం అనే చెప్పాలి. 2004లో ముఖ్యమంత్రిగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని చేపట్టిన అయన, ఆ తరువాత ప్రజలకోసం తప్పనిసరిగా మంచి చేయాలనే తపనతో రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రి ఎంబెర్స్మెంట్, 108 వంటి పథకాలు నూతనంగా రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఒకరకంగా ఆ మూడు పథకాలే రాజశేఖర్ రెడ్డి గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. ఏదైనా పెద్ద వ్యాధి వస్తే వైద్యం చేయుంచుకోలేని ప్రతి పేదవాడికి అయన ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకం అప్పట్లో జీవన ప్రదాతగా నిలిచింది. ఇక ఆపై అయన ప్రవేశ పెట్టిన ఫీజు రి ఎంబెర్స్మెంట్ పథకం ద్వారా మన రాష్ట్రంలోని ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారి పిల్లలు పైచదువులు చదివేందుకు గొప్ప ఆసరా లభించింది. ఇక ఏదైనా ప్రమాదం జరిగితే కుయ్ కుయ్ అంటూ ఒక్క ఫోన్ కాల్ తో ప్రమాద ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి అతడికి ఆయువు పోయాలని తలంపుతో అయన ప్రవేశపెట్టిన 108 పథకం మన రాష్టరంలోని ఎందరివో ప్రాణాలు నిలిపింది. 

అయితే ఇవి మాత్రమే కాక ఆయన అప్పటికే గత ప్రభుత్వాల ద్వారా అమల్లో ఉన్న పథకాలను మరింతగా ప్రజలకు ఎటువంటి లోపాలు లేకుండా అందించడంలో చాలావరకు సఫలం అయ్యారనే చెప్పాలి. అందుకే ఆ తరువాత 2009లో ఎన్నికలు వచ్చిన సమయంలో ఎన్ని పార్టీలు ఎదురు నిలబడ్డప్పటికీ అయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు  సాధించి, మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా అయన పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆ తరువాత అతికొద్దిరోజులకే అయన హెలికాఫ్టర్ ప్రమాదంలో అకాల మరణం పొందడం జరిగింది. ఇక నేడు అయన జయంతిని పురస్కరించుకుని రాబోయే రోజుల్లో అయన తనయుడు మరియు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు మేలు చేకూర్చేలా తన సేవలందిస్తారని వైసిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: