ఇప్పటి వరకు దేశంలో ఎంతో మంది నాయకులు వచ్చారు...వస్తూనే ఉన్నారు.  అతి కొద్ది మంది మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారు.  అలాంటి వారిలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ది చేకూరింది. అందుకే ఆ మహానేత చనిపోయిన తర్వాత ఎంతో మంది ఆవేదన చెందారు..గుండెపోటుతో మరణించారు.  ఇక రాజన్నను చూడలేమా అన్న సమయంతో ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చారు.  అప్పుడే ఏపి ప్రజలు అన్నారు..మళ్లీ మా కళ్లముందుకు రాజన్న వచ్చాడని. 

తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి బాటలో నడుస్తూ ‘ప్రజా సంకల్పయాత్ర’ ద్వారా గడప గడపకు తిరిగాడు..ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశారు..నే విన్నా..నే ఉన్నా అంటూ ప్రజలకు భరోసా ఇచ్చాడు.  ఆ మాటలు ఏపి ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి..అందుకే ఆయనను ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారీటీతో గెలిపించి ఏపి ముఖ్యమంత్రిని చేశారు.  మొదటి నుంచి వైఎస్ జగన్ రైతు పక్షపాతిగానే ఉంటున్న విషయం తెలిసిందే.  అందుకే ఇప్పటి వరకు ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయం యావత్ భారత దేశం గర్వించే నిర్ణయం తీసుకున్నారు.

నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి ఏపిలో  ‘రైతు దినోత్సవం’ దినోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500, ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,000 కోట్లు, వడ్డీలేని రుణాలు.. విపత్తు సహాయ నిధి కింద రూ.2,000 కోట్లు, ఉచిత పంటల బీమా.. తదితర పథకాలకు సర్కారు శ్రీకారం చుట్టారు. అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా ఇప్పటికే ప్రకటించిన పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గం(కేబినెట్‌) ఆమోద ముద్ర వేసిన మిగతా పథకాలను సోమవారం రైతు దినోత్సవ సభలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మహానేత పుట్టిన రోజు నుంచే రైతు దినోత్సవాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు జగన్. రైతులంటే నాన్నగారికి ప్రాణం.. అందుకు ఆయన పుట్టిన రోజు నాడు.. పాదయాత్రలో రైతులు చెప్పిన మాట ప్రకారం.. రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: